Venu Udugula : పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రెడీ చేస్తోన్న విరాటపర్వం డైరెక్టర్

|

Jul 21, 2022 | 7:59 AM

వేణు ఊడుగుల .. చేసింది రెండు సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మేపించాడు వేణు.

Venu Udugula : పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రెడీ చేస్తోన్న విరాటపర్వం డైరెక్టర్
Venu Udugula
Follow us on

వేణు ఊడుగుల(Venu Udugula ).. చేసింది రెండు సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మేపించాడు వేణు. నీదీ నాది ఒకటే కథ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా వేణు ఊడుగుల తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వేణు ఊడుగుల. రానా , సాయి పల్లవి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు ప్రశంసలు దక్కాయి.

యదార్ధ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తున్నారని ఆసక్తి నెలకొంది.  ఇక ఇప్పుడు వేణు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎవరితో సినిమా చేయనున్నాడన్నది త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తాడని వేణు ఊడుగుల చెప్పుకొస్తున్నారు. ఈ సారి తాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక కథను రెడీ చేసుకున్నట్టుగా తెలిపారు. ఇది తాను తయారు చేసుకున్న కల్పిత కథ అనీ… పూర్తి కమర్షియల్ అంశాలతో ఉంటుందని చెప్పుకొచ్చారు వేణు ఊడుగుల.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి