
కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ‘సలార్’తో రచ్చ చేసేందుకు రెడీ అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డీలా పడగా.. ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని సలార్ పైనే పెట్టుకున్నారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ లుక్‌లో ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇదే కావడం మరో కారణం. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సలార్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఈ మూవీని డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక త్వరలోనే సలార్ ప్రమోషన్స్ షూరు చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారట మేకర్స్.
ఇక అన్ని ఈవెంట్లలో సలార్ చిత్రయూనిట్ తోపాటు ప్రభాస్ సైతం పాల్గొంటాడని అంటున్నారు. ఇక డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ ప్రమోషన్స్ కోసం ఏకంగా కోహ్లీ టీంనే రంగంలోకి దించారు మేకర్స్. చాలా కాలంగా హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ బెంగుళూరు ఐపీఎల్ టీంతో తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయిస్తుంది. గతంలో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాకు సైతం ఆర్సీబీ (RCB) ప్రమోషన్స్ చేసింది. ఇప్పుడు సలార్ ట్రైలర్ గురించి ఆర్సీబీ టీం ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో కోహ్లీ వెనక్కి తిరిగి ఉండగా.. సిరాజ్, మ్యాక్స్ వెల్ ఉండి డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రాబోతుందని ప్రమోట్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమా కోసం ఆర్సీబీ టీం మరిన్ని ప్రచార కార్యక్రమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరలవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Just 18 days to go for the #SalaarCeaseFire Trailer launch, on Dec 1st at 7:19 PM! 💥
The excitement is building up as we eagerly await #Salaar from our partners @hombalefilms 🍿#RCBxHombale #ನಮ್ಮRCB #ನಮ್ಮHombale #PlayBold #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel… pic.twitter.com/rphMEb0ODF
— Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2023
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు డిసెంబర్ 22న రిలీజ్ కానుండగా.. సెకండ్ పార్ట్ గురించి అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించనుండగా.. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Join the powerplay of excitement as we gear up for the ultimate #SalaarCeaseFire Trailer showdown! Lock in your spot and witness the action unfold on Dec 1st at 7:19 pm.
Let’s hit this one out of the park💥@RCBTweets #RCBxHombale #ನಮ್ಮRCB #ನಮ್ಮHombale #PlayBold#Salaar… https://t.co/UTbp5fkeAf— Hombale Films (@hombalefilms) November 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.