Vikram : ఆరేళ్లుగా ఆగిపోయిన సినిమాను ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ చేసిన విక్రమ్

| Edited By: Rajeev Rayala

Jul 19, 2023 | 9:09 AM

ఆరేళ్లుగా కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాక కాక, ఎన్నై అరిందాల్, రాఘవన్‌ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో గౌతమ్ మీనన్‌ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం.

Vikram : ఆరేళ్లుగా ఆగిపోయిన సినిమాను ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ చేసిన విక్రమ్
Vikram
Follow us on

స్టైలిష్ యాక్షన్‌ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో వర్సటైల్ స్టార్ విక్రమ్ హీరోగా మొదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా వరుస వాయిదాలతో మూలన పడింది. ఆరేళ్లుగా కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాక కాక, ఎన్నై అరిందాల్, రాఘవన్‌ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో గౌతమ్ మీనన్‌ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం. హీరోగా విక్రమ్‌ స్కై హైలో ఉన్న టైమ్‌లో మొదలైన ఈ సినిమా బడ్జెట్‌ సమస్యలతో ఆగిపోయింది. 2015లోనే ప్రీ ప్రొడక్షన్ మొదలైనా… 2017 వరకు సినిమా పట్టాలెక్కలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా వరుస ఇబ్బందులతో వాయిదా పడుతోంది.

విక్రమ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్‌ లాంటి దేశాల్లో చిత్రీకరించారు. 2019 లోనే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఎనౌన్స్ చేశారు. కానీ ఆ తరువాత గౌతమ్ మీనన్‌ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఫైనల్‌గా ధృవ నక్షత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఆరేళ్ల షూటింగ్ తరువాత ధృవ నక్షత్రం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో రిలీజ్ విషయంలో ఫైనల్‌ డెసిషన్ తీసుకుంది చిత్రయూనిట్‌. డేట్‌ లాక్‌ చేసి వాయిదా వేయటం కన్నా.. డేట్‌ చెప్పకుండా ప్రమోషన్‌ స్టార్ట్ చేసింది. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద స్పై సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో ధృవ నక్షత్రంకి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్‌. మరి ఇన్నేళ్ల తరువాత రిలీజ్‌కు రెడీ అవుతున్న చియాన్ మూవీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.