Balakrishna Movie: బాలకృష్ణ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న గ్రామస్థులు.. కారణమేంటో తెలుసా..?

|

Feb 22, 2021 | 12:13 PM

Balakrishna BB3 Movie Shooting : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు..

Balakrishna Movie: బాలకృష్ణ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న గ్రామస్థులు.. కారణమేంటో తెలుసా..?
Follow us on

Balakrishna BB3 Movie Shooting : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయని చెప్పాలి. వీటికి అనుగుణంగానే బోయపాటి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వికారాబాద్‌ మండలం కొటాలగుడెం గ్రామంలో జరుగుతోంది. అయితే శనివారం గ్రామస్థులు ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. తమ గ్రామంలో వెంటనే షూటింగ్‌ నిలిపి వేయాలని అభ్యంతరం తెలిపారు. ఇంతకీ షూటింగ్‌ ఎందుకు అడ్డుకున్నారనేగా మీ సందేహం. తమ గ్రామంలో సినిమా చిత్రీకరణలు జరగడం వల్ల పంటలు పాడవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్ధికి సహాయం అందిస్తేనే షూటింగ్‌ చేసుకునేందకు అనుమతిస్తామని వాదించినట్లు సమాచారం. అయితే తమకు ఇక్కడ సినిమా షూటింగ్‌ చేసుకోవడానికి అనుమతులున్నాయని చిత్ర యూనిట్‌ వాదించినా గ్రామస్థులు ఆందోళన విరమించకపోవడంతో చిత్రయూనిట్‌ అక్కడి వెను దిరిగిందని సమాచారం. మరి చిత్ర యూనిట్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Titanic: టైటానిక్‌ కొత్త ముగింపు చూశారా..? ‘జీవితం ఒక్కటే అన్నిటికంటే విలువైంది’ అనే డైలాగ్‌ అదుర్స్‌..