Vijayendra Prasad: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి తండ్రి..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో రవితేజ విక్రమార్కుడు ఒకటి. మాస్ రాజా రవితేజ కెరియర్‌లో మరో మైలు రాయిగా నిలిచింది ఈ సినిమా

Vijayendra Prasad: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి తండ్రి..
Vijayendra Prasad

Edited By:

Updated on: Sep 19, 2021 | 7:25 PM

Vijayendra Prasad: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో రవితేజ విక్రమార్కుడు ఒకటి. మాస్ రాజా రవితేజ కెరియర్‌లో మరో మైలు రాయిగా నిలిచింది ఈ సినిమా. రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్న ఈ సినిమాలో అందాల భామ అనుష్క హీరోయిన్‌గా నటించింది. అత్తిలి సత్తిబాబుగా ..అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్‌‌‌గా రెండు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు రవితేజ. ముఖ్యంగా పోలీస్ పాత్ర రవితేజకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక రవితేజ అనుష్క మధ్య రొమాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రీమేక్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విజయంలో కీరవాణి సంగీతం ముఖ్యపాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలని చూస్తున్నారట. ఈ సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు అద్భుతమైన కథను రెడీ చేశారట. ఇక ఈ కథను తన కొడుకు రాజమౌళి కాకుండా బయట దర్శకులకు ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ చూస్తున్నారట. అందుకు కారణం లేకపోలేదు… రాజమౌళి మరో నాలుగేళ్లవరకు బిజీగా ఉండనున్నారు అందువల్ల మరో దర్శకుడికి ఈ కథను ఇవ్వాలని చూస్తున్నారట విజయేంద్రప్రసాద్.  వినాయక్ .. పూరి.. సురేందర్ రెడ్డి ఈ ముగ్గురిలో ఒకరు విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.