ఫ్యాన్సే నాకు ఆత్మబలాన్నిచ్చే సైన్యం… నేనేం సాధించినా వాళ్లు నా వెనకుండబట్టే అంటున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. రాజకీయాల్లోకొచ్చి.. సినిమాల్ని ఆఫ్‌బీట్‌గా మార్చుకున్న రాములమ్మ సడన్‌గా.. ఇలా అభిమాన దేవుళ్ల గురించి స్పెషల్‌గా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆమెకు కర్తవ్యం మళ్లీ గుర్తుకొచ్చిందా.. సినిమాలు కంటిన్యూ చేస్తారా? అనేవి ఇండస్ట్రీలో పుట్టిన కొత్త డౌట్లు. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి… ప్రొఫెసర్ భారతి పాత్రతో తన మార్క్ నిలబెట్టుకున్నారు విజయశాంతి. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో రాములమ్మ రిటర్న్స్ అనే సౌండ్ కూడా ఇండస్ట్రీలో వినిపించింది. మళ్లీ ఇద్దరం కలిసి నటిద్దామా.. అని మెగాస్టార్ ఫన్నీగా ఓ బంపరాఫర్ కూడా ఇచ్చారు. కానీ.. సినిమాల విషయంలో విజయశాంతి మైండ్‌సెట్ ఎలా వుందన్నది అప్పటినుంచీ ఓ మిస్టరీగానే నడుస్తోంది.
లేటెస్ట్‌గా చిరంజీవి చేస్తున్న లూసీఫర్ రీమేక్‌లో విజయశాంతి పక్కా అనుకున్నారు. చిరూతో సిస్టర్‌గా నటిస్తారా అనే సందేహాలు కూడా వినిపించాయి. కానీ.. ఆ ప్రపోజల్ రియాలిటీలోకి వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మరికొన్ని భారీ సినిమాల్లో ఆఫర్లొచ్చినా… సున్నితంగా తిరస్కరించి మళ్లీ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారు మేడమ్ వైజయంతి. పార్టీ మారి.. పబ్లిక్‌లైఫ్‌లో ఇంకాస్త చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్‌గా మళ్లీ సినిమాల వైపు చూస్తున్నారా అనే సిగ్నల్స్ ఇచ్చారు విజయశాంతి. తన కెరీర్‌లో చేసిన యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి ఒక అభిమాని చేసిన మాషప్ వీడియోను స్పెషల్‌గా పోస్ట్ చేసి.. ఐ లవ్ మై ఆర్మీ అని క్యాప్షన్ పెట్టారు.
Heart felt Thanks to this video from My Fans
Fans are the Real Motivational Force for my Confidence and Achievements , Always and Forever…
Vijayashanthi pic.twitter.com/qEmqFwCYix
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 20, 2021
అటువైపు… పవన్‌కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు.. సినిమా చరిష్మాను పొలిటికల్ లైఫ్‌కి సపోర్టింగ్ ఫోర్స్‌గా వాడుకుంటున్నారు. రాములమ్మ కూడా అదే ఆలోచనలో వున్నారా అనే టాక్ మొదలైంది. ఇప్పట్లో సినిమాలతో ఎక్కువగా ఎంగేజ్ అయ్యే ఆలోచనే లేదన్నది విజయశాంతి ఒపీనియన్. తన మేనేజర్‌కి గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఒకే ఒక్క సినిమాలో నటించాలన్నది ఆమె ఫ్యూచర్ ప్లాన్‌గా తెలుస్తోంది. అది కూడా విశాల్ లేదా.. సాయిధరమ్‌తేజ్.. వీళ్లిద్దరిలో ఒకరికి సిస్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతకుమించి.. సినిమా స్టార్‌డమ్‌ని యుటిలైజ్ చేసుకునే థాట్ ప్రాసెస్‌లో లేనంటున్నారు లేడీ సూపర్‌స్టార్.
Also Read: ‘మా’ లో తీన్ మార్.. సీన్‌లోకి జీవితా రాజశేఖర్.. రాజుకుంటున్న రాజకీయం..