
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పర్సనల్ లైఫ్ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇన్నాళ్లు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంతో వార్తలలో నిలుస్తున్నారు. సొంతంగా టీవీకే పార్టీ ప్రారంభించి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలోనే ఆయన వివాహ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందని.. తనకు విడాకులు ఇప్పించాలంటూ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత నెల 24న ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..
ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దళపతికి ఆయన భార్య సంగీత మరో షాకిచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌పై రెండో పిటిషన్ దాఖలు చేసింది భార్య సంగీత. విడాకుల కేసు ముగిసేవరకు విజయ్ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. విజయ్ కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె విషయంలోనే తమ మధ్య విబేధాలు వచ్చాయని.. ఐదేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తునట్టు పిటిషన్ లో తెలిపారు. ఆమెతో ప్రేమాయణం నడుపుతూ విజయ్ తనకు నమ్మకద్రోహం చేశారని.. వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు రెండో పిటిషన్ దాఖలు చేశారు సంగీత.. విడాకుల కేసు ముగిసేవరకు విజయ్ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‌నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
మరోవైపు విజయ్ పర్సనల్ లైఫ్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగ.. ఇటీవల హీరోయిన్ త్రిషతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు విజయ్. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్‌లో రావడం చర్చనీయాంశమైంది. ఓ నటితో విజయ్‌కి వివాహేతర సంబంధం ఉందన్న భార్య సంగీత ఆరోపించిన నేఫథ్యంలో.. విజయ్, త్రిష కలిసి రావడం.. ఇప్పుడు మరో పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.
ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..