Vijay Thalapathy: పొలిటికల్‌ ఎంట్రీపై బిగ్‌ హింట్‌ ఇచ్చేసిన విజయ్‌ దళపతి.. ప్రతి నియోజకవర్గంలో..

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన పార్టీ పోటీ చేయనుందా? ఇందుకు ఇప్పటినుంచే అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తమిళనాడు మీడియా సర్కిళ్లలో. గత కొన్ని నెలలుగా హీరో విజయ్‌ చేస్తున్న కామెంట్లు.. అలాగే అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు..

Vijay Thalapathy: పొలిటికల్‌ ఎంట్రీపై బిగ్‌ హింట్‌ ఇచ్చేసిన విజయ్‌ దళపతి.. ప్రతి నియోజకవర్గంలో..
Vijay Thalapathy

Updated on: Nov 14, 2023 | 8:10 PM

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన పార్టీ పోటీ చేయనుందా? ఇందుకు ఇప్పటినుంచే అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తమిళనాడు మీడియా సర్కిళ్లలో. గత కొన్ని నెలలుగా హీరో విజయ్‌ చేస్తున్న కామెంట్లు.. అలాగే అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీలో భాగమేనంటూ నంటూ చాలామంది భావిస్తున్నారు. ‘నేను దళపతిని, ప్రజల దళపతిని, వాళ్లు ఏది చెబితే అది చేస్తాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను’ అంటూ తన లేటెస్ట్‌ సినిమా లియో విజయోత్సవ వేడుకల్లో దళపతి చేసిన కామెంట్స్‌ కూడా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పుడీ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తూ తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని నటుడు విజయ్ నిర్ణయించారు. విజయ్‌ అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యుల పర్యవేక్షణలో ఈ లైబ్రరీలను నిర్వహించనున్నారు. ఇప్పటికే లైబ్రరీల కోసం పుస్తకాలు కొనుగోలు చేసినట్లు అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు తెలియజేశారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ లైబ్రరీలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

కాగా కొన్ని నెలల క్ఇరతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఉచిత ట్యూషన్ సెంటర్లు, క్లినిక్‌లను ఏర్పాటు చేశారు విజయ్‌ అభిమానులు. అలాగే రాష్ట్రంలోని 10వ తరగతి, 12వ తరగతి టాపర్‌లకు నగదు పురస్కారాలు అందించి సత్కరించాడు. ఇవన్నీ విజయ్‌ రాజకీయ ఎంట్రీకి బాటలేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా ఏళ్లుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల మీద ఇంతవరకు విజయ్ అధికారికంగా స్పందించలేదు, అలా అని ఖండించలేదు కూడా. మరి ఇప్పుడైనా దళపతి రాజకీయాల్లోకి రావటం ఖాయమేనా? అన్నది త్వరలోనే తెలియనుంది.

ఇవి కూడా చదవండి

విజయ్ అభిమానుల సేవా కార్యక్రమాలు..

విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..