Lokesh Kanagaraj: ‘లియో’ డైరెక్టర్ పై విజయ్ దళపతి తండ్రి షాకింగ్ కామెంట్స్ ?.. సినిమా బాలేదంటే అలా చేశాడంటూ..
ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన కోలీవుడ్ స్టార్ దర్శకుడితో తనకు జరిగిన ఫోన్ కాల్ సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా విడుదలకు ముందు చూసి సెకండ్ ఆఫ్ బాలేదని చెప్పానని.. అందుకు ఆ డైరెక్టర్ తన మాట వినకుండానే ఫోన్ కట్ చేశాడని అన్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఒక సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ఫస్ట్ కాపీ చూశాను. వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని..
విజయ్ దళపతికి ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి ఎస్. చంద్రశేఖర్ సైతం కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన కోలీవుడ్ స్టార్ దర్శకుడితో తనకు జరిగిన ఫోన్ కాల్ సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా విడుదలకు ముందు చూసి సెకండ్ ఆఫ్ బాలేదని చెప్పానని.. అందుకు ఆ డైరెక్టర్ తన మాట వినకుండానే ఫోన్ కట్ చేశాడని అన్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ” ఒక సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ఫస్ట్ కాపీ చూశాను. వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. సినిమా ఎలా తీయాలో మీ దగ్గరే నేర్చుకోవాలని అన్నాను. నేను చెప్పిన మాటలన్నీ ఆ దర్శకుడు ఓపికగా విన్నాడు. కానీ సెకండాఫ్ బాలేదని.. అందులో ఉన్న లోపాలను చెప్పగానే దర్శకుడు భోజనం చేస్తున్నాని వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అతడు తిరిగి నాకు కాల్ చేయలేదు. కానీ ఆ డైరెక్టర్ నా మాట వినలేదు. సినిమా విడుదలయ్యాక అందరికీ నాకు వచ్చిన సందేహాలే వ్యక్తం చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా పేరు, దర్శకుడు పేరు తీయకుండా చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పరొక్షంగా లియో సినిమా గురించే అంటున్నారు.
“విజయ్ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటాను. వాటిలో ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి నివృత్తి చేసుకుంటాను. కానీ నేటి రోజుల్లో స్క్రీన్ ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ సినిమాలో ఒక స్టార్ హీరో ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వలలేదనుకుంటున్నారు. హీరో వల్లే సినిమా హిట్ అయినా… తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడు. కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది నా అభిప్రాయం. ఈరోజుల్లో ఎవరికీ వారు తప్పు చేసినప్పుడు అంగీకరించే ధైర్యం లేదా పరిపక్వత లేదు. వారే ఎప్పుడూ కరెక్ట్ అని భావిస్తారు” అని అన్నారు. దీంతో చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తలపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు . గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల చంద్రశేఖర్, విజయ్ దళపతి మధ్య అనుబంధం ఉండడం లేదు. ఒక సంవత్సరం క్రితం తన స్టార్‌డమ్‌ను తమ సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని తన తల్లిదండ్రులపై కేసు దాఖలు చేయడానికి కోర్టును ఆశ్రయించాడు విజయ్. అలాగే తనకు, తన కొడుకు విజయ్ దళపతితో మంచి సంబంధాలు లేవని చెప్పాడు చంద్రశేఖర్.
2nd Half கொஞ்சம் சரி இல்ல.. எல்லாரும் வச்சி செஞ்சாங்க.. லியோ கதையை சாடினாரா சந்திரசேகர்..?#NewsTamil24x7 | #LEO | #Vijay | #ThalapathyVijay | #LokeshKanagaraj | #SAChandrasekhar pic.twitter.com/P6cndI0YzR
— News Tamil 24×7 | நியூஸ் தமிழ் 24×7 (@NewsTamilTV24x7) January 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.