Vijay Vamsi paidipally movie: ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లు అంటేనే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ వేరు… స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమా లు చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు 5, 6 వందల కోట్లకు చేరాయి. వసూళ్ల నెంబరైతే ఇంకా భారీగా ఉంటోంది. దీంతో హీరోల పేమెంట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఆల్రెడీ వందల కోట్ల మార్క్ రీచ్ అయిన హీరోలు.. పేమెంట్ విషయంలోనూ తగ్గేదే లేదంటున్నారు. డార్లింగ్ ప్రభాస్… 100 కోట్ల పేమెంట్ అందుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ పేమెంట్ అందుకుంటున్న స్టార్‌గా అవతరించారు ప్రభాస్. ఇప్పుడు ఆ ప్లేస్‌ను టార్గెట్ చేస్తున్నారట కోలీవుడ్ దళపతి విజయ్. వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న విజయ్… నెక్ట్స్ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ మాస్టర్ సినిమాను నార్త్‌లో కూడా రిలీజ్ చేసిన దళపతి.. నెక్ట్స్ సినిమా మేకింగ్ నుంచి పాన్ ఇండియా స్టాండర్ట్స్ ఫాలో అవుతున్నారు. రీజినల్ సినిమాతోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విజయ్‌తో పాన్ ఇండియా సినిమా అంటే.. వసూళ్లు మరో రేంజ్‌లో ఉంటాయంటున్నారు ఫ్యాన్స్.
నెల్సన్ దిలీప్ సినిమా తరువాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు విజయ్.. ఈ సినిమాకు ఏకంగా 100 కోట్ల పేమెంట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. పేమెంట్ విషయంలో డార్లింగ్‌కు పోటీ ఇస్తున్న ఒకే ఒక్క హీరో విజయే అవుతారంటున్నారు ఫిలిం క్రిటిక్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :