Vidudala Movie Review: మనకు తెలిసినా.. మనల్ని కట్టిపడేసే కథ ”విడుదల”..

వన్ ఆఫ్ ది కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ విడుదల పార్ట్ 1. విదుతలై పార్ట్ 1పేరుతో .. తమిళ్లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో.. తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి కోలీవుడ్లో హిట్టైన ఈ సినిమా.. తెలుగు ఆడియెన్స్ హార్ట్ ను తాకుతుందా..? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..! ఇక కథ విషయాన్ని వస్తే.. కుమరేశన్‌ […]

Vidudala Movie Review: మనకు తెలిసినా.. మనల్ని కట్టిపడేసే కథ విడుదల..
Vidudhala

Updated on: Apr 16, 2023 | 8:07 AM

వన్ ఆఫ్ ది కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ విడుదల పార్ట్ 1. విదుతలై పార్ట్ 1పేరుతో .. తమిళ్లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో.. తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి కోలీవుడ్లో హిట్టైన ఈ సినిమా.. తెలుగు ఆడియెన్స్ హార్ట్ ను తాకుతుందా..? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

ఇక కథ విషయాన్ని వస్తే.. కుమరేశన్‌ అలియాస్ సూరి ఓ కొండ ప్రాంతంలో పోలీస్‌ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్‌కౌంటర్‌ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్‌ పెరుమాళ్‌ అలియాస్ విజయ్‌ సేతుపతిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే డ్రైవర్‌ కుమరేశన్‌ అడవిప్రాంతంలో నివసించే యువతి తమిళరసి అలియాస్‌ పాప భవాని శ్రీ తో ప్రేమలో పడతాడు. కానీ లీడర్ పెరుమాళ్‌ను వెతికే క్రమంలో.. కొండప్రాంతంలో నివసించేవారందరితో పాటు.. తమిళరసిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెడుతుండడంతో.. తట్టుకోలేక పోతారు కుమరేశన్‌. మరి ఇష్టపడిన అమ్మాయిని భాదను చూడలేక కుమరేశన్‌ ఏం చేశాడు? పెరుమాళ్‌ కోసం సాగించే వేటలో కుమరేశన్‌ ఎలాంటి పాత్ర పోషించాడు? చివరకు పెరుమాళన్‌ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ.

ఇక తన సినిమాల్లో సహజత్వానికి పెద్ద పీట వేసే డైరెక్టర్ వెట్రిమారన్ ..ఈ సినిమాను కూడా అలాగే తెరకెక్కించారు. పాత్రలు.. వాటి నడవడికతో పాటు.. రూపు రేఖలు కూడా చాలా సహజంగా ఉండేలా చూసుకున్నాడు. దానికితోడు.. పోలీసులు నక్సలైట్ల మధ్య జరిగే పోరును.. ఆ పోరు కారణంగా.. వారిద్దరి మధ్య అమాయకులైన ప్రజలు నలిగిపోయే తీరును డైరెక్టర్ వెట్రిమారన్ చాలా బాగా చూపించారు. ఇక ట్రైన్ యాక్సిడెంట్ తో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత నిజాయితీ పరుడైన పోలీస్ కుమరేశన్ చుట్టూ తిరిగుతుంది. ఆ తరువాత పెరుమాళ్ ఎంట్రీతో.. సినిమాలో ఒక తెలియని వేడి రగులుతోంది. దానికి తోడు.. పెరుమాళ్‌ కోసం అమాయకులైన కొండ ప్రజలను పోలీసులు హింసించే సీన్లు.. అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. రియాల్టీని గుర్తు తెస్తుంది. కాకపోతే.. సాగదీసే సీన్లు.. స్లో నరేషన్ .. ఎక్కువైన తమిళ వాసనలు ఈ సినిమాకు పెద్ద మైనస్.

ఇక కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో పోలీస్ డ్రైవర్గా.. సీరియన్ రోల్ చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే.. కుమరేశన్‌ పాత్రలో సూరి జీవించేశాడు. దానికి తోడు పెరమాళ్ క్యారెక్టర్‌లో విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అదరగొట్టాడు. వీరిద్దరికితోడు మిగిలిన వాళ్లు వాళ్ల పరిధిమేర నటించారు. ఇళయరాజా సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ కూడా అద్బుతంగా కుదిరింది. ఇక ఒక్క మాటలో విడుదల గురించి చెప్పాలంటే.. మనకు తెలిసినా.. మనల్ని కట్టిపడేసే.. సామాజిక నేపథ్యమే ఈ కథ!