టాలీవుడ్ క్రేజీ హీర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సినిమా వస్తుందటే హడావిడి మాములుగా ఉండదు. తక్కువటైం లోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు. సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విజయ్. రీసెంట్ గా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించి ఆకట్టుకున్నడు. ఇదిలా ఉంటే విజయ్ ఓ క్రేజీ బయో పిక్ లో నటించాలని ఆశపడుతున్నాడట.
ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాతో పాటు శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్. వీటితో పాటు ఓ స్టార్ క్రికెటర్ జీవిత కథలో నటించాలని ఆశపడుతున్నాడు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని తెలిపాడు. ఇప్పటికే ధోనీ బయోపిక్ ను సుశాంత్ రాజ్ పుత్ తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్ ను చేయాలనుకుంటున్నానని… కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చాడు విజయ్. మరి, విజయ్ దేవరకొండ కోహ్లీ బయోపిక్ నటిస్తాడా… ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి