Kingdom : బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతున్న కింగ్‌డమ్.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుపోతుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ స్పై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. భారీ అంచనాల మధ్య జూలై 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. అలాగే మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది.

Kingdom : బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతున్న కింగ్‌డమ్.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Kingdom

Updated on: Aug 04, 2025 | 7:23 PM

విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.అభిమానులు ఎప్పటి నుంచో విజయ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని వెయ్యికళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు విజయ్ భారీ హిట్ అందుకున్నాడు. ఆ ఏడుకొండల స్వామి దయతో బిగ్ హిట్ సొంతం చేసుకున్నాడు. విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. గురువారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా రూ.39 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కింగ్ డమ్ సినిమాను వీక్షిస్తున్నారు. మూవీపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

కలెక్షన్స్ పరంగా కింగ్‌డమ్ సినిమా దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. మళ్లీరావా, జెర్సీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్న నూరి ఈ మూవీని తెరకెక్కించాఉ. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ తో పాటు మలయాళ నటుడు వెకంటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు.అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఇక కింగ్ డమ్ సినిమా నాలుగో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. 4వ రోజు కలెక్షన్లు అఫీషీయల్‌గా బయటకు వచ్చాయి. ఈ సినిమా 4 రోజుల్లో ఏకంగా.. రూ.82 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. మరో రెండు రోజుల్లో రూ. 100కోట్ల మార్కును ను దాటనుంది కింగ్‌డమ్ మూవీ.

అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి