నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
సినీనటి కల్పిక! ఈ మధ్య తరుచూ వివాదాలతో సోషల్ మీడియాలో వైరల అవుతోంది ఈమె. గతంలో గతంలో ప్రిజమ్ పబ్‌లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకు వెళ్లింది. పబ్ సిబ్బందిపై దుర్బాషలు ఆడుతూ ఆమె చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది. ఇక ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్‌లోనూ ఆమె అలాగే ప్రవర్తించింది. రిసార్ట్ మేనేజర్‌తో పాటు సిబ్బందిపైనా బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది.
అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియక అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగోలేదని కామెంట్స్ చేశారు చాలా మంది. ఇక ఇప్పుడు తండ్రి కూడా ఇదే విషయం బయటపెట్టాడు. ఆమె పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. సోషల్ మీడియాలో ఈమె గురించి మరో సారి చర్చ లేవనెత్తాడు. కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ తన కూతురిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని.. ఆమె వల్ల కుటుంబసభ్యులకు, ప్రజలకు ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొని సంచలనంగా మారాడు. అంతేకాదు ఇప్పటికే కల్పిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపాడు సంఘవార్ గణేష్. కల్పిక రెండేళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు. తన కూతురిని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం
రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్? నీకెలా నేషనల్ అవార్డ్ వచ్చింది?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

