Actor : మీరిచ్చిన పేరుతోనే జీవిస్తున్నాను.. సత్యసాయి సేవలో స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సత్యసాయి శతజయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 18న బాబా రథోత్సవంతో ప్రారంభమైన ఈ వేడుకలు.. ఆదివారం జరిగే శతజయంతితో ముగుస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Actor : మీరిచ్చిన పేరుతోనే జీవిస్తున్నాను.. సత్యసాయి సేవలో స్టార్ హీరో..  ఎవరో గుర్తుపట్టారా.. ?
Vijay Devarakonda

Updated on: Nov 23, 2025 | 4:18 PM

సత్యసాయి శతజయంతి నేడు. ఈ సందర్భంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతున్న పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 18న బాబా రథోత్సవంతో ప్రారంభమైన ఈ వేడుకులు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు హాజరయ్యారు. ఇదెలా ఉంటే.. సత్యసాయి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సినీప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో సైతం చిన్నవయసులో తాను సత్యసాయి సేవ సన్నిధిలో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తనకు నెలల వయసులో అక్కడే నామకరణం చేశారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

పైన ఫోటోను చూశారు కదా.. అందులో సత్యసాయి సన్నిధిలో ఉన్న కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నారు గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో అతడు క్రేజీ హీరో. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆ ఫోటోలో కళ్లద్దాలు ధరించి కనిపిస్తున్న కుర్రాడు మరెవరో కాదు.. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. సత్యసాయి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు విజయ్. అలాగే చిన్నవయసులో సత్యసాయి సన్నిధిలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. నెలల వయసులో తనకు విజయ్ సాయి అని ఆయన నామకరణం చేశారని గుర్తుచేసుకున్నారు. అదే పేరుతో తాను ప్రతి రోజూ జీవిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు పోషించిన విజయ్.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారారు. కానీ అతడికి హీరోగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీతో విజయ్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..