AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushi: ‘మ్యారేజ్ సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది కదా’ అంటే విజయ్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే..

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్లలో విజయ్‌ దేవరకొండ ఒకరు. రౌడీ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. మరి ఇతగాడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడన్నది ఈ మధ్య హాట్‌ టాపిక్‌గా అయ్యింది. ఈ విషయంపై ఖుషి సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో విజయ్‌ రెస్పాండ్ అయ్యాడు. అలాగే సినిమాల్లో మ్యారేజ్ సెంటిమెంట్ వర్కువట్ అవ్వడంపై క్రేజీ కామెంట్స్ చేశాడు.

Kushi: 'మ్యారేజ్ సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది కదా' అంటే విజయ్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే..
Vijay Deverakonda
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2023 | 9:15 PM

Share

సెప్టెంబర్ 1న విడుదలయిన ఖుషీ సినిమా డీసెంట్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించే  ఇప్పుడు టాక్ అంతా. మా రౌడీ హీరో సూపర్ హిట్ కొట్టాడంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా సక్సెస్‌తో సంతోషంగా ఉన్నాడు. అటు విమర్శకులు,  ఫ్యామిలీ యూత్ ఆడియన్స్ నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చాడు. యాక్షన్ మోడ్‌లో అతను గట్టిగానే కష్టపడ్డా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.  “ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ చూస్తారు. దాని నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఫెయిల్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు” అనేది విజయ్ దేవరకొండ నమ్ముతున్న కాన్సెప్ట్. అందుకే విజయ్ ముందుకు రాగలిగాడు. కుషీతో బ్యాక్ టూ ఫామ్ అని చెప్పకనే చెప్పాడు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట జీవిత అనుభవాలను ఈ సినిమాలో దర్శకుడు శివ నిర్వాణ చూపించారు. గతంలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చిన పెళ్లి కాన్సెప్ట్‌తో ఖుషీ తెరకెక్కింది. ఈ సెంటిమెంట్ విజయ్ కి బాగా వర్కువుట్ అయ్యింది. పెళ్లి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన విజయ్ సినిమాలు పెళ్లి చూపులు, గీత గోవిందం.. మంచి విజయాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి అనే కాన్సెప్ట్ కలిసి వచ్చింది కదా.. అని విజయ్‌ను అడిగితే… ‘అనవసరమైన సెంటిమెంట్లు పెట్టకండి. అదే నిజమైతే ప్రతి సినిమాలో పెళ్లి సీన్ పెట్టాల్సి వస్తుంది’ అని విజయ్ జోక్ చేశాడు.

విజయ్ తన రియల్ లైఫ్ మ్యారేజ్ గురించి కూడా  హింట్ ఇచ్చాడు. పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటానని, అది కూడా చాలా సింపుల్ ఉంటుందని, ఎవరికీ చెప్పనని అన్నాడు.  ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని, జీవితంలో ఎప్పుడైనా డైరెక్షన్‌ కూడా చేస్తానని విజయ్‌ వెల్లడించాడు.  “నాపై కేర్ చూపించే  భాగస్వామి కావాలి. నేను పనిలో పడితే ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా గుర్తుండవు. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే శ్రీమతి ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది.”  అని విజయ్ వివరించాడు.  జీవితంలో మనీ, రెస్పెక్ట్ ముఖ్యమని అనుకుంటా. నన్నెవరైనా అగౌరవంగా చూస్తే క్షమించను  అని విజయ్ పేర్కొన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.