Liger Movie: ఫేమస్ చాయ్ వాలాతో విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రమోషనల్లో రౌడీ బిజీ బిజీ..

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ముంబైలో లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్. హీరోయిన్ అనన్యతో కలిసి ఇటీవల బాంబే వీధుల్లో సందడి చేసిన రౌడీ..

Liger Movie: ఫేమస్ చాయ్ వాలాతో విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రమోషనల్లో రౌడీ బిజీ బిజీ..
Vijay Deverakonda

Edited By:

Updated on: Aug 06, 2022 | 4:38 PM

ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లైగర్ పై మరింత హైప్ క్రియేట్ చేయగా.. మరోవైపు రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా అక్డీ పక్డీ పాట నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ముంబైలో లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్. హీరోయిన్ అనన్యతో కలిసి ఇటీవల బాంబే వీధుల్లో సందడి చేసిన రౌడీ.. ఇప్పుడు పాట్నాకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఫేమస్ టీ స్టాల్లో అభిమానులతో కలిసి చాయ్ ను ఆస్వాదించారు. పాట్నాలోని లేన్ లో ఉన్న ప్రముఖ టీ స్టాల్ గ్రాడ్యుయేట్ చైవాలీని సందర్శించారు విజయ్. అభిమానులతో టీ తాగి, వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. క్యాజువల్ లుక్‏లో కనిపించిన విజయ్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 25న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.