Vijay Deverakonda Liger: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం లైగర్ (Liger). సాలా క్రాస్‌బ్రీడ్ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజవుతోంది. అనన్యాపాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, పాటలకు ఊహించని స్పందన వచ్చింది. కాగా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవల హీరో హీరోయిన్లు ముంబై వీధుల్లో సందడి చేశారు. తాజాగా పాట్నాలో తన సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్.
He came. He saw. He roared in every heart in #Patna!?
కాగా పాట్నాలోని లేన్ లో ఉన్న ప్రముఖ టీ స్టాల్ గ్రాడ్యుయేట్ చైవాలీని సందర్శించాడు విజయ్. అక్కడ అభిమానులతో కలిసి టీ తాగి, వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నాడు. అడిగిన వారందరికీ సెల్ఫీలు, ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. కాగా పాట్నా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది చిత్రబృందం. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంతో విజయ్‌ను చూసి అక్కడి అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తిస్తోన్న వీడియోలు రౌడీ బాయ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఒక మీటింగ్‌లో విజయ్‌ను చూడగానే అభిమానులు హోరెత్తిపోయారు. వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి నుంచి లైగర్ బాయ్ వెళ్లిపోయాడు.
The excitement for Vijay Deverakonda and his film – #Liger is real ?
The mass superstar had to yet again leave a promotional event after there was a frenzy at a college in Patna, eager to meet the star himself! pic.twitter.com/9NIa1AddW2