AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా కథ నాకు సెట్ కాదు.. అందుకే చేయలేదు.. సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకోవడం పై విజయ్ దేవరకొండ

సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 2016లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోగా మారారు.

ఆ సినిమా కథ నాకు సెట్ కాదు.. అందుకే చేయలేదు.. సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకోవడం పై విజయ్ దేవరకొండ
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: May 15, 2025 | 7:21 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కింగ్ డమ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మధ్య విడుదలైన పోస్టర్స్, వీడియోలు, సాంగ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఒకే ఒక జీవితం సినిమాలో ఎందుకు నటించలేదో కూడా చెప్పాడు విజయ్. ముందుగా ఈ కథ నేనే విన్నాను. కథను మూడు సార్లు విన్నాను.. నేను నటించడంతో పాటు నిర్మించాలని అనుకున్నా.. కానీ ఆ సినిమా కథ నా బాడీ లాంగ్వేజ్ కు సరిపోదేమో అనిపించింది. అందుకే నటించలేకపోయాను అని తెలిపాడు విజయ్ దేవరకొండ.

ఇక ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో నటించి మెప్పించారు. దర్శకుడు శ్రీకార్తిక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్ మాట్లాడుతూ.. కింగ్ డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అదరగొట్టేశాడు అని అన్నారు. అలాగే కింగ్ డమ్ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకురావట్లేదు.. ముందుగా ఒక కథతో వస్తున్నాం సినిమా హిట్ అయితే సీక్వెల్స్ గురించి ఆలోచిద్దాం అని అనుకున్నాం.. అందుకే కింగ్ డమ్ 1 అని టైటిల్ పెట్టలేదు.  గౌతమ్ నాకు రెండు కథలు చెప్పాడు.. వాటిలో కింగ్ డమ్ యాక్షన్ డ్రామా కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువ ఉంటుంది అని విజయ్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?