Vijay Deverakonda : ప్రస్తుతం హీరోలంతా విభిన్నమైన కథలను పాత్రలను చేయడానికి మక్కువ చూపుతున్నారు.. ప్రేక్షకులకు కూడా కొత్తదాన్నని కోరుకోవడంతో చాలా మంది స్టార్ హీరోలు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పాత్రలు చేస్తున్నారు. మునుపెన్నడూ కనిపించని విధంగా లుక్స్ మార్చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా కొత్తగా ప్రయత్నించాలని ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ అనేక కారణాల వల్ల బ్రేకులేసుకుంటూ మెల్లగా సాగుతుంది. లైగర్ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు పూరి.
ఇదిలా ఉంటే లైగర్ సినిమాతోపాటు మరోసినిమా కూడా విజయ్ తో చేయాలని చూస్తున్నారు పూరి. ఎప్పటినుంచో తన మైండ్ లో ఉన్న జనగణమన అనే కథను విజయ్ తో తీయాలని పూరి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మహేష్ బాబుతో చేయాల్సి ఉంది. ఏవేవో కారణాలవల్ల ఇప్పుడు అది విజయ్ దగ్గరకు వచ్చింది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన
ను లైగర్ అయిపోయిన వెంటనే మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారట. మిలటరీ హెయిర్ కటింగ్ తో విజయ్ దేవరకొండ కనిపిస్తాడట. ఇప్పటికే లొకేషన్ ల రెక్కీని నిర్వహించిన టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తికరమైన ప్లేస్ ని ఫిక్స్ చేసిందట.మొదటి షడ్యుల్ కోసం ఏకంగా సౌత్ ఆఫ్రికాను ఎంపిక చేశారట పూరి. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ నటించే ఛాన్స్ ఉందని టాక్.. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :