Vijay Deverakonda Rashmika : సత్యనారాయణ స్వామి వ్రతంలో విజయ్ రష్మిక.. ఊరందరికి భోజనాలు పెట్టిన రౌడీ..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన ఈ జంట.. విజయ్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామంలో సందడి చేశారు.

Vijay Deverakonda Rashmika : సత్యనారాయణ స్వామి వ్రతంలో విజయ్ రష్మిక.. ఊరందరికి భోజనాలు పెట్టిన రౌడీ..
Vijay, Rashmika

Updated on: Mar 02, 2026 | 5:59 PM

టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఐటీసీ హోటల్లో గ్రాండ్ గా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా.. ఈవేడుక అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్ రష్మిక. ఇప్పుడు విజయ్ సొంతూరు అయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామంలో సందడి చేశారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

దాదాపు 32 సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయ్ కుటుంబసభ్యులకు గ్రామస్తులు, అభిమానులు కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సత్యనారాయణ వ్రతంలో విజయ్ ను చూస్తూ రష్మిక మురిసిపోయిన వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే విజయ్ తన సొంతూరులోని తుమ్మన్ పేట గ్రామస్తులందరికి మంచి విందు ఏర్పాటు చేశారు. దాదాపు 3 వేల మందికి పైగా విందు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

మరోవైపు ఈ జంట పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా పలు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున స్వీట్స్ పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే.. మార్చి 4న హైదరాబాద్ లో సినీప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

Follow Us