Vijay Devarakonda’s Liger: మరోక్రేజీ అప్ డేట్ ఇచ్చిన లైగర్ టీమ్.. అదిరిపోయిన బీటీఎస్ స్టిల్స్..

| Edited By: Ram Naramaneni

Dec 30, 2021 | 10:05 AM

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్..

Vijay Devarakondas Liger: మరోక్రేజీ అప్ డేట్ ఇచ్చిన లైగర్ టీమ్.. అదిరిపోయిన బీటీఎస్ స్టిల్స్..
Liger
Follow us on

Vijay Devarakonda’s Liger: క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దమా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ తనను తాను చాలా మార్చుకున్నాడు. ప్రొఫిషనల్ బాక్సర్ గా మారాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలో నటించని  మైక్ టైసన్ మొదటిసారి లైగర్ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. అదిరి పోయే అప్డేట్స్ తో 2021 కు గుడ్ బై చెప్పాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో.. డిసెంబర్ 29 ఈ సినిమా మొదటి గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పారు చిత్రయూనిట్. అలాగే తాజాగా లైగర్ మూవీ బీటీఎస్ స్టిల్స్ ని విడుదల చేశారు. ఈ స్టిల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీటీఎస్ స్టిల్స్ చూస్తుంటే సినిమా ఏ లెవల్‌లో ఉంటుందో అర్ధమవుతుంది. అలాగే నేడు సాయంత్రం 4:00 గంటలకు స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్ ని విడుదల చేయనున్నారు. ఫైనల్ గా డిసెంబర్ 31 న `లైగర్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నామని తెలిపారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..