Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ అదిరిపోయే డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో..

ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహర్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ

Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ అదిరిపోయే డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో..
Ananya Panday

Edited By:

Updated on: May 31, 2022 | 7:44 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీ్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహర్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనన్య. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి అనన్య, విజయ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరు కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ లేటేస్ట్ మూవీ జగ్ జగ్ జియో చిత్రంను విజయ్, అనన్యలు ప్రమోషన్ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని పంజాబ్బన్ పాటకు వీరిద్దరు కలిసి హుక్ స్టేప్ వేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఈ పాట జోరుకు హుక్ స్టెప్ వేయకుండా ఉండలేకపోయాం. సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. జగ్ జగ్ జియో టీం కు శుభాకాంక్షలు అంటూ షేర్ చేసింది. విజయ్, అనన్య కలిసి హుక్ స్టె్ప్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు.. విజయ్ పూరి దర్శకత్వంలో జనగనమణ సినిమా చేస్తున్నాడు. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.