కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న మీరా సెప్టెంబర్ 20న తెల్లవారు జామున తన గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కూతురి మరణంతో విజయ్ ఎంతో కుంగిపోయాడు. అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడిన కూతురు ఉన్నట్లుండి సూసైడ్ చేసుకోవడాన్ని ఆంటోని కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. తన పెద్ద కూతురు ఇంకా తనతోనే మాట్లాడుతుందని.. మీరాతోపాటే తాను చనిపోయానంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు విజయ్. ఇక పై తాను చేసే మంచి పనులకు తన కూతురు పేరే పెడతానని అన్నారు. కూతురు లేదన్న బాధను దిగమింగుకుని తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు విజయ్. ఇటీవల రత్తం సినిమా ప్రమోషన్లకు చిన్న కూతురు లారాతో కలిసి పాల్గొన్నాడు. సోమవారం తన కూతురిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు విజయ్ ఆంటోని సతీమణి ఫాతిమా. మీరా ఆలోచనలు చంపేస్తున్నాయని.. ఎంతో కుమిలిపోతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఫాతిమా.
“నువ్వు కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాలోనే దాచుకునేదాన్ని. ఆ సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించకుండా ఉండేదాన్ని. ఇప్పుడు నీ ఆలోచనలతో నేను కుమిలిపోతున్నాను. అవి నన్ను చంపేస్తున్నాయి. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. అమ్మా, నాన్నల వద్దకు వచ్చేయ్. నీ చెల్లెలు లారా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. లవ్ యు తంగం” అని ఫాతిమా ఎమోషనల్ అయ్యారు.
If I’d known u will live only for 16 yrs,
I would have just kept u very very close to me,not even shown you to the sun and moon,am drowning and dying with ur thoughts,can’t live without you ,come back to babba and amma.laara keeps waiting for u,love u Thangam@vijayantony pic.twitter.com/7PAQ5Ji9qp— Fatima Meera Vijay Antony (@mrsvijayantony) October 9, 2023
ఫాతిమా ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. “అమ్మల ప్రేమ లోతైన సముద్రం కంటే లోతైనది.. మీ బాధను వర్ణించడానికి పదాలు లేవు ఫాతిమా మామ్.. ఈ నష్టాన్ని భరించే శక్తిని మీకు, మీ కుటుంబానికి అందించాలి.. మీరా ఎప్పుడూ మీతోనే ఉంటుంది”, “ధైర్యంగా ఉండండి సోదరి.. దేవుడు మీ కుటుంబానికి అండగా ఉంటాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— vijayantony (@vijayantony) September 21, 2023
కూతురు మరణించిన తర్వాత విజయ్ స్పందిస్తూ.. “నా కూతురు మీరా అత్యంత దయగల, ధైర్యవంతురాలు. ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి, మతం, కులం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం లేదా చెడు లేని చోటికి వెళ్లిపోయింది. ఆమె ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళింది. ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడుతోంది. ఆమె చనిపోయినప్పుడు నేను కూడా లోపల నుండి చనిపోయాను. ఇప్పుడు ఆమెతో గడపడం మొదలుపెట్టాను’ అని ట్వీట్ చేశారు.