Kanta Rao Wife Death: సినీ నటుడు కాంతారావు సతీమణి హైమావతి (87) గుండెపోటుతో మృతి.. సినీ ప్రముఖుల సంతాపం
Kanta Rao Wife Death: పాత కాలం నాటి హీరోలలో కాంతారావుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో పోషించి అభిమానుల్లో చెరగని ముద్ర..

Kanta Rao Wife Death: పాత కాలం నాటి హీరోలలో కాంతారావుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో పోషించి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కాంతారావు. 2009 మార్చి 22న ఆయన మరణించగా, శుక్రవారం మధ్యాహ్నం కాంతారావు సతీమణి హైమావతి (87) గుండెపోటుతో మరణించారు. మల్లాపూర్‌లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. హైమావతి మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.




