ఆ స్టార్ హీరోని చిన్నతనం నుంచి చూస్తున్నా.. నన్ను పేరు పెట్టి పిలిచేది అతను ఒక్కడే: జయసుధ.. :

సినీ నటి జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటి ఆవిడ. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరగాని ముద్ర వేశారు జయసుధ. సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ.

ఆ స్టార్ హీరోని చిన్నతనం నుంచి చూస్తున్నా.. నన్ను పేరు పెట్టి పిలిచేది అతను ఒక్కడే: జయసుధ.. :
Jayasudha

Updated on: Jan 21, 2026 | 7:49 PM

సీనియర్ నటి జయసుధ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత సహాయక పాత్రలు చేసి మెప్పించారు. ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు జయసుధ. ఒకప్పుడు ఎంతో మంది హీరోల సరసన హీరోయిన్ గా చేసిన జయసుధ ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్నారు. సినిమాలతోనే కాదు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ పై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయన సినీ ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నదని జయసుధ అన్నారు. అప్పటికే నలుగురైదుగురు పెద్ద హీరోలు ఉన్న సమయంలో కొత్తగా వచ్చి తనదైన స్థానాన్ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు అని ఆమె అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తక్కువగా మాట్లాడతారని, తాను బాలు సినిమాలో మాత్రమే నటించానని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ..

మహేష్‌ను చిన్నతనం నుంచీ చూస్తున్నానని జయసుధ తెలిపారు. తాను మహేష్‌తో మహర్షి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి రెండు చిత్రాలలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. మహేష్ తన తండ్రి కృష్ణ మాదిరిగానే చాలా తక్కువగా మాట్లాడుతాడు అని అన్నారు జయసుధ. తనను మహేష్ జయసుధ గారు అని పిలుస్తాడని, తాను మాత్రం మహేష్ అని పిలుస్తానని సరదాగా తెలిపారు. తన వ్యక్తిగత జీవితం, స్నేహితులు గురించి కూడా జయసుధ మాట్లాడారు. తన క్లోజెస్ట్ ఫ్రెండ్ రాధిక అని, జయప్రద కూడా తన పెళ్లికి, తన భర్త నితిన్ అంత్యక్రియలకు వచ్చిందని తెలిపారు. సాగర సంగమం సినిమా ఆఫర్ మొదట తనకు వచ్చిందని, కమల్ హాసన్ డేట్స్ మార్చడం వల్ల ఎన్.టి.ఆర్ సినిమా వదులుకోవాలా, లేక విశ్వనాథ్ గారి సినిమా వదులుకోవాలా అన్న సందిగ్ధంలో ఎన్.టి.ఆర్ సినిమాను ఎంచుకున్నానని వివరించారు జయసుధ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..