ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ తెలుగు కంటెట్‌తో ఓటీటీ ఫీల్డ్‌లో సపరేట్‌గా దూసుకుపోతున్న ఆహాలో.. కొత్తగా మరో వెబ్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. వేరే లెవల్ ఎంటర్‌టైన్మెంట్‌తో.. వేరే లెవల్ ఆఫీస్ అనే సీరీస్.. మొదలుకాబోతోంది. డిసెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవబోతోంది. ఇక ఈ సిరీస్ నుంచే కార్పొరేట్ ఆంథమ్ రిలీజ్ అయింది. అది కాస్తా ఇప్పుడు జాబ్ చేస్తున్న యూత్‌కు కనెక్ట్ అవుతూ.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
ఈ. సత్తి బాబు డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న వేరే లెవల్ ఆఫీస్ సిరీస్‌లో.. ఆర్జే కాజల్.. బిగ్ బాస్ ఫేం అఖిల్ సార్థక్, సుబశ్రీ, మిర్చి కిరణ్, యాంకర్ రీతూ చౌదరి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పటికే తమ ప్రమోషన్స్‌తో.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందీ టీం.
ఈ క్రమంలోనే ఈసిరీస్‌పై మరిన్ని అంచనాలను పెంచేందుకు … జనాల్లోకి మరింతగా ఈ సిరీస్‌ను తీసుకెళ్లేందుకు.. కార్పొరేట్ ఆంథమ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఆంథమ్‌కు అజయ్ అర్సాదా మ్యూజిక్ అందించారు. ఈయన ఇచ్చిన ట్యూన్ క్యాచీగా ఉండడం..లిరిక్స్.. సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్‌కు అద్దం పడుతుండడంతో.. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 12న స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఈ సిరీస్ వైపే చూసేలా చేస్తోంది.