AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 4 Exam: గ్రూప్‌ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. కరెక్ట్‌ ఆన్సర్‌ ఏంటో చెప్పగలరా?

మార్చి 3న చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన బలగం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీ, టీవీల్లోనూ ఆదరణ దక్కించుకుంది. హృద్యమైన కథ, కథనాలతో కూడిన ఈ మూవీకి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కాగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా కావడంతో బలగం సినిమాకు ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యతనిస్తోంది.

TSPSC Group 4 Exam: గ్రూప్‌ 4 పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. కరెక్ట్‌ ఆన్సర్‌ ఏంటో చెప్పగలరా?
Tspsc Group 4 Exam
Basha Shek
|

Updated on: Jul 01, 2023 | 4:12 PM

Share

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలును కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వేణు యేల్డండి దర్శకత్వం వహించారు. అప్పటివరకు జబర్దస్త్ కమెడియన్‌గా పరిచయమైన వేణుకు డైరెక్టర్‌గా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చి 3న చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన బలగం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీ, టీవీల్లోనూ ఆదరణ దక్కించుకుంది. హృద్యమైన కథ, కథనాలతో కూడిన ఈ మూవీకి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కాగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా కావడంతో బలగం సినిమాకు ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న అడిగారు. తాజాగా ఈరోజు (జులై 1) జరిగిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్షలోనూ ‘బలగం’ సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే..

ప్రశ్న: బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి?

దీనికి ఆప్షన్స్‌గా..

A. దర్శకుడు: వేణు యెల్దండి B. నిర్మాత దిల్‌ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్‌ రెడ్డి C. సంగీత దర్శకుడు: భీమ్స్‌ సిసిరోలియో D. కొమరయ్య పాత్రను పోషించినది: ఆరుసం మధుసుధన్‌ అనే ఆప్షన్స్‌ ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు

1. A, B, C మరియు D 2. A, B మరియు D మాత్రమే 3. A మరియు B మాత్రమే 4. A, B మరియు C మాత్రమే

ఇవి కూడా చదవండి

దీనికి సరైన సమాధానం: 4

బలగం సినిమాలో కొమరయ్య పాత్రలో నటించింది సుధాకర్‌ రెడ్డి అనే సీనియర్‌ నటులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..