
Venkatesh Daggubati సీనియార్ హీరో వెంకటేష్ మంచి జోరు మీదున్నారు. వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు వెంకీ. ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకటేష్. తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతోపాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎఫ్ 2 అనే సూపర్ హిట్ సినిమా చేశారు. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.
ఈ సినిమాతోపాటు దృశ్యం 2 లో నటిస్తున్నాడు వెంకీ. దృశ్యం సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను తెలుగులో వెంకీనే రీమేక్ చేసాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ దృశ్యం2 చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది. వీటిలో నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే దృశ్యం 2 మొత్తం షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. జూన్ చివరి నాటికి అన్ని పనులు ముగించి జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఇలా ఈ సమ్మర్ లో వెంకీ ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇలా వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు ఈ సీనియర్ హీరో.
మరిన్ని ఇక్కడ చదవండి :
Uppena in OTT : డిజిటల్ లో రిలీజ్ కానున్న అందమైన ప్రేమ కథ.. ఉప్పెన.. విడుదల తేదీ ఎప్పుడంటే..!