AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: పవర్ ఫుల్ పాత్రలో వెంకీ మామ.. సైంధవ్ మూవీ బ్యాక్‌డ్రాప్ అదేనా..

యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు.

Venkatesh: పవర్ ఫుల్ పాత్రలో వెంకీ మామ.. సైంధవ్ మూవీ బ్యాక్‌డ్రాప్ అదేనా..
Saindhav
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2023 | 7:33 AM

Share

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఉండబోతోందనీ తెలుస్తోంది. ఇటీవలే హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవలే ఈ సినిమానుంచి టైటిల్ ను రివీల్ చేశారు.

ఈ మూవీలో వెంకీ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. రఫ్ లుక్ లో అదరగొట్టారు వెంకటేష్. ఈ సినిమాకు సైంధవ్  అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ టీజర్ తోనే ఒక గొప్ప ఇంప్యాక్ట్ క్రియేట్ చేయగా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్.

సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తోంది. మెడికల్ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వెంకీ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు. రానాతో కలిసి వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి రామానాయుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?