
Venkatesh Next Movie With Sekhar Kammula: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోందా.? సెన్సిబుల్ కథలతో అందమైన సినిమాలు తీసే దర్శకుడు.. సెన్సిబుల్ కథాంశాల్లో నటించే హీరో చేతులు కలపనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ‘ఆనంద్’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఒక వర్గం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఫీల్ గుడ్ సినిమాల్లో నటిస్తూ మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో విక్టరీ వెంకటేష్. సీనియర్ హీరోగా మారిన ఈ తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గినట్లు తనను తాను మార్చుకొని సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. శేఖర్ కమ్ముల ఇటీవలే వెంకటేష్‌కు కథ వినిపించాడని దానికి వెంకీ కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఓకే అయితే తెలుగులో మరో ఆసక్తికరమైన సినిమా ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలు పూర్తికాగానే వీరి కాంబినేషన్‌లో చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Venky Shekarkammula Movie