
సీనియర్ హీరో వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో అలరించారు వెంకటేష్. ఈ సిరీస్ లో రానా కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో బూతులు, బోల్డ్ సీన్స్ పై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా ఇన్నిరోజులు చూసిన ఆడియన్స్ ఇలా బోల్డ్ సిరీస్‌లో వెంకీని చూడటానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు వెంకీ. శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.
హిట్ సినిమాతో శైలేష్ కొలను మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో సైంధవ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మొన్నామధ్య విడుదల చేసిన గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు నాని నటించిన జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ , దర్శకుడు శైలేష్ తో సహా మరికొంతమంది కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.
Schedule wrap ! Onto planning the next sched. Stay tuned for some mad updates from here on 🙂 #SaindhavOnDec22 ❤️🔥
Victory @VenkyMama @Nawazuddin_S @iRuhaniSharma @ShraddhaSrinath @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @NiharikaEnt @maniDop pic.twitter.com/7sXWA1c3ns
— Sailesh Kolanu (@KolanuSailesh) June 28, 2023