AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాబోయ్.! హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా.. ఎవరో గుర్తుపట్టగలరా

హీరోగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. కానీ కొందరు మాత్రమే కథానాయకులుగా రాణిస్తారు. మంచి ఫిజిక్, హైట్ ఉంటేనే హీరో కాదు.. విలన్స్ గానూ మరిపోతారు. అలాంటి వారిలో సలీమ్ బేగ్ ఒకరు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood: బాబోయ్.! హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా.. ఎవరో గుర్తుపట్టగలరా
Salim Baig
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2024 | 10:55 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేశ్ నటించిన ఓ సూపర్ హిట్ మూవీలో భయంకరమైన విలన్ గా కనిపించాడు సలీమ్ భేగ్. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి అడియన్స్ కు ప్రతినాయకుడిగానే గుర్తుండిపోయాడు. కానీ ఇప్పుడు అతడి టేనేజ్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. అప్పటికీ ఇప్పటికీ సలీమ్ బేగ్ లుక్ చాలా మారిపోయింది. అప్పట్లో అచ్చం హీరోలా కనిపిస్తున్నాడు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సలీమ్.. ఇప్పుడు హీరో రేంజ్ కటౌట్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. దీంతో హీరోలా ఉన్నోడిని విలన్ ను చేసేశారు కదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టరా.. ? అదేనండి ఘర్షణ సినిమాలోని పాండా..

2004లో వెంకటేశ్ హీరోగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా ఘర్షణ. ఇందులో ఆసిన్ హీరోయిన్ గా నటించగా.. రరి ప్రకాశ్, డానియెల్ బాలాజీ, వంశీకృష్ణ కీలకపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సలీమ్ బేగ్ విలన్ పాండా పాత్రలో నటించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు సలీమ్ బేగ్. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అతడు.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యాడు. అలాగే సోషల్ మీడియాలోనూ సలీమ్ బేగ్ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ చాలా రోజుల క్రితం అతడు షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అందులో అచ్చం హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.