Venkatesh and Soundarya: ఆరు భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్, సౌందర్య సినిమా ఎదో తెలుసా..?

మన దగ్గర హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో అలాగే వేరే భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు మన దగ్గర రీమేక్ అవుతూ ఉంటాయి. మన తెలుగు సినిమా ఒకటి ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.? మీకోసం ఓ హింట్ ఆ సినిమాలో హీరో వెంకటేష్, అలాగే హీరోయిన్ సౌందర్య. అది ఏ సినిమాలో చెప్పుకోండి చూద్దాం.! చెప్పడం కష్టమే. ఎందుకంటే వెంకటేష్, సౌందర్య కలిసి చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

Venkatesh and Soundarya: ఆరు భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్, సౌందర్య సినిమా ఎదో తెలుసా..?
Venkatesh And Soundarya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2023 | 11:11 AM

ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాను వెంటనే రీమేక్ చేయడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంది. మన దగ్గర హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో అలాగే వేరే భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు మన దగ్గర రీమేక్ అవుతూ ఉంటాయి. మన తెలుగు సినిమా ఒకటి ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.? మీకోసం ఓ హింట్ ఆ సినిమాలో హీరో వెంకటేష్, అలాగే హీరోయిన్ సౌందర్య. అది ఏ సినిమాలో చెప్పుకోండి చూద్దాం.! చెప్పడం కష్టమే. ఎందుకంటే వెంకటేష్, సౌందర్య కలిసి చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇంతకు ఆరు భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్, సౌందర్య సినిమా ఎదో మీకు తెలుసా..?

వెంకటేష్ , సౌందర్య కలిసి చాలా సినిమాల్లో మెప్పించారు. ఏ ఇద్దరి జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా పవిత్ర బంధం. పవిత్ర బంధం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలో సౌందర్య నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ మూవీలో వెంకటేష్ కు తండ్రిగా గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం నటించారు. ఇక ఈ సినిమా ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, తమిళ్‌, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది . ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. అన్ని భాషలో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో పవిత్ర బంధం సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. అలాగే ఉత్తమ నటిగా సౌందర్యకు, ఉత్తమ సహాయనటుడిగా బాలసుబ్రహ్మణ్యం నంది అవార్డులు అందుకున్నారు.

వెంకటేష్ సౌందర్య కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

సౌందర్య తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య.

 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.