Duniya Vijay: హీరోయిన్‌గా ‘వీర సింహారెడ్డి’ విలన్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహ రెడ్డి సినిమాలో విలన్ గా నటించిమెప్పించాడు దునియా విజయ్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు దునియా విజయ్ బాటలోనే ఆయన కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

Duniya Vijay: హీరోయిన్‌గా వీర సింహారెడ్డి విలన్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే
Duniya Vijay Daughter

Updated on: Dec 07, 2025 | 6:17 PM

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన ఇద్దరు కుమార్తెలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దునియా విజయ్ చిన్న కుమార్తె మోనిషా ఇప్పటికే వినయ్ రాజ్ కుమార్ సరసన ‘సిటీలైట్స్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక మొదటి కుమార్తె రితన్య ఇప్పటికే తన తండ్రితో కలిసి ‘ల్యాండ్ లార్డ్’ చిత్రంలో నటించింది. అయితే ఇప్పుడు ఆమె కథానాయికగా అధికారికంగా ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ దల్వాయ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న జవారా అనే సినిమాలో రితన్య హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో షైతాన్ వెబ్ సిరీస్ ఫేమ్ రిషి హీరోగా నటిస్తున్నాడు. జవర’ సినిమా ముహూర్తం బండే మహాకాళి ఆలయంలో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ నటుడు రంగాయణ రఘు, నటి శ్రుతి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో భూమి పాత్రలో రితన్య విజి నటిస్తోంది. దీని గురించి మాట్లాడుతూ, ‘నేను మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వారితో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నానుఅని రితన్య చెప్పుకొచ్చింది. షైతాన్ వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియెన్స్ ను భయపెట్టిన రిషి సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నాడు.’ కథ నాకు చాలా నచ్చింది. దర్శకుడు కథ చెబుతూనే స్క్రీన్‌ప్లే కూడా సిద్ధం చేసుకున్నాడు. నాకు ఇది చాలా నచ్చింది. దర్శకుడు చాలా ఆలోచించిన కథ ఇది. ఆయనను డైరెక్టర్ అని కాకుండా క్రియేటివ్ హెడ్ అని పిలుస్తారు. రితన్య చాలా బాగా నటిస్తుంది అని అన్నారు. శాకాహారి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన రంగాయణ రఘు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఈ సినిమాలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

కొత్త సినిమా లాంఛ్ లో దునియా విజయ్ కూతురు..

ఈ సినిమాలో దర్శకుడు ప్రదీప్ దర్శకత్వంతో పాటు సంభాషణల బాధ్యతలను కూడా స్వీకరించారు. ధర్మ విష్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. హలేష్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.

రితన్య లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .