నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో మలయాళ బ్యూటీ హానీ రోజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా ఈ నెల 23తో వందరోజులు పూర్తి చేసుకోనుంది. ఇక హిందూపురంలో బాలయ్య వీరసింహారెడ్డి శతదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నెల 23న వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అనుమతి కోరింది తెలుగుదేశం పార్టీ. ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో వేడుకలును మున్సిపల్ అధికారులు నిరాకరించారు. దాంతో బాలయ్య అభిమానులు,టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు అభిమానులు. సినిమా వంద రోజుల వేడుక కోసం పోలీసుల సమక్షంలో 2సార్లు చర్చలు జరిపారు మున్సిపల్ అధికారులు. అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చారు. అయినా సరే హిందూపురంలోనే నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు అంటున్నారు. దాంతో ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్ కాకుండా మరో ప్లేస్ పరిశీలిస్తున్నారు టీడీపీ శ్రేణులు.