
మెగా హీరో వరుణ్ తేజ్ సతీమణి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోమవారం (డిసెంబర్ 15) తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా, అల్లు కుటుంబీకులతో పాటు పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు లావణ్యకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. లావణ్యతో వివిధ సందర్భాల్లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వరుణ్ తేజ్ ‘హ్యాపీ బర్త్ డే బేబీ’.. అంటూ భార్యపైతన ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల లావణ్యకు బర్త్ డే విషెస్ తెలిపింది. అలాగే అభిమానులు కూడా మెగా కోడలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోల్లో వరుణ్, లావణ్యల ముద్దుల కుమారుడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా చూశారు. కానీ అదేమీ జరగలేదు. తమ కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు వరుణ్- లావణ్య.
మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు వరుణ్- లావణ్య. ఇదే సమయంలో ప్రేమలో పడ్డారు. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. అనంతరం కొణిదెల ఫ్యామిలీకి ఇష్ట దైవమైన హనుమంతుడి పేరు వచ్చేలా తమ కుమారుడికి వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు వరుణ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. అధర్వ మురళితో కలిసి ఆమె నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది
And double the happiness!
Bestest news Vadhina and Anna!♥️♥️♥️@AlwaysRamCharan @upasanakonidela https://t.co/EK71lOxbaa— Varun Tej Konidela (@IAmVarunTej) October 23, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .