Varun Tej’s Ghani: మెగా ప్రిన్స్ రిలీజ్ పంచ్.. గ్రాండ్‌గా వరుణ్ తేజ్ ‘గని’ ఈవెంట్..

|

Apr 06, 2022 | 8:01 PM

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)నటించిన లేటెస్ట్ మూవీ గని(Ghani) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Varun Tejs Ghani: మెగా ప్రిన్స్ రిలీజ్ పంచ్.. గ్రాండ్‌గా వరుణ్ తేజ్ గని ఈవెంట్..
Ghani
Follow us on

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)నటించిన లేటెస్ట్ మూవీ గని(Ghani) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుణ్‌ తొలిసారి స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా  పెరిగాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌లు ఆ అంచనాలను ఆకాశానికి అంటేలా చేశాయి. గద్దల కొండ గణేశ్‌ వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో వరుణ్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. తాజాగా రిలీజ్ పంచ్ పేరుతో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో ఈ ఈవెంగ్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి.