మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా గని ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో హైలెట్ అయ్యాయి. ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి.. ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది.. అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నదియా.. జగపతిబాబు.. సునీల్ శెట్టి.. ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు . సిక్స్ ప్యాక్ లుక్‌లో వరుణ్ అదిరగొట్టాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యేందుకు గని ఎంతగా కష్టపడ్డాడో చూడొచ్చు.. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.
Here you go, #GhaniTrailer ???https://t.co/pmEAw2J1BB
It’s just a glimpse of the hard work we put in..hope you’ll like it!#Ghani is Coming to Deliver the knockout Punch on 8th April 2022!#GhaniFromApril8th @dir_kiran @MusicThaman @RenaissanceMovi pic.twitter.com/4YNpmgR0TK
— Varun Tej Konidela ? (@IAmVarunTej) March 17, 2022
Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..
Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..