Varun Tej – Lavanya Tripathi: శుభవార్త చెప్పిన వరుణ్ తేజ్, లావణ్య దంపతులు.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మెగా హీరో. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తెలియజేశారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యత అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు వరుణ్ తేజ్.

Varun Tej - Lavanya Tripathi: శుభవార్త చెప్పిన వరుణ్ తేజ్, లావణ్య దంపతులు.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ..
Varun Tej, Lavanya Tripathi

Updated on: May 06, 2025 | 12:33 PM

మెగా కుటుంబం నుంచి గుడ్ న్యూస్ షేర్ చేశారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు వరుణ్ తేజ్. దీంతో నెట్టింట ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడంటూ అభిమానులు, సినీతారలు పోస్టులు పెడుతూ వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ హీరోహీరోయిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2023లో ఘనంగా జరిగింది. 2017లో మిస్టర్ సినిమా సెట్ లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతరిక్షం సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు సమాచారం. కానీ తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగానే ఉంచారు.

2023లో నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ తమ ప్రేమబంధాన్ని అధికారికంగా వెల్లడించారు. వీరిద్దరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో జరిగింది. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో వరుణ్ బిజీగా ఉండగా.. లావణ్య మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కేవలం సినిమా ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొంటుంది. మరోవైపు సోష్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..