తెలిసన్నారో తెలియకన్నారో.. తెలియదు కానీ ఒకే ఒక్క మాట నిర్మాత దిల్ రాజును నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యేలా చేస్తుంది. ఓ హీరో అభిమానులకు ఆ మాట చెవిలో అమృతం పోసినట్లుంటే.. మరో హీరో ఫ్యాన్స్‌కు మాత్రం కడుపులో మంట పెట్టినట్లుంది. ఎప్పుడూ సినిమాలతో ట్రెండయ్యే దిల్ రాజు.. ఇప్పుడు మాత్రం ఆ ఒక్క మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చారు. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు హీరోలు ట్రెండ్ అవుతుంటారు.. లేదంటే దర్శకులు ట్రెండ్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిర్మాత దిల్ రాజు ట్రెండ్ అవుతున్నారు. సంక్రాంతికి వారసుడు సినిమాతో వస్తున్న ఈయన చేసిన ఒకే ఒక్క కామెంట్.. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఆల్రెడీ అజిత్, విజయ్ ఫ్యాన్స్ ఉప్పు నిప్పులా ఉంటారు.. ఇప్పుడు దిల్ రాజు కామెంట్స్‌తో ఆ మంట మరింత పెరిగింది.
పొంగల్‌కు అజిత్ తునివు.. విజయ్ వారసుడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని.. అందుకే వారసుడుకు ఎక్కువ స్క్రీన్స్ కావాలని తాను చెన్నై వెళ్లి అడుగుతానంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీసాయి. అక్కడ 800 స్క్రీన్స్‌లో చెరో సగం ఇద్దరు హీరోలకు ఇవ్వాలని బయ్యర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ కామెంట్స్ చేసారు.
అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. సమ ఉజ్జీల్లాంటి హీరోల్ని ఎక్కువ తక్కువ చేసి చూపడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా అజిత్ అభిమానులు దిల్ రాజుతో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన దిల్ రాజు.. తానెవర్నీ తక్కువ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకమించి ఈ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడలేదు ఈ నిర్మాత.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.