సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్న వారు చాలా మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ తమ జీవితంలో ఎదురైనా చేదు అనుభవాలను, అవమానాలను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తెలిపింది. ఆ భామ మరెవరో కాదు వర్సటైల్ నటిగా తెలుగు, తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. ఆతర్వాత తన నటనను మెరుగుపరుచుకుంటూ.. ఇప్పుడు స్టార్ యాక్టర్ గా మారిపోయారు. హీరోయిన్ గానే కాదు లేడీ విలన్ గా తనదైన మార్క్ ను చూపించారు వరలక్ష్మీ.
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా ఆమె నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వరలక్ష్మీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా బాలయ్య సినిమాలో మరోసారి సత్తా చాటింది.
మరోసారి గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన గొంతు గంభీరంగా ఉండటంతో చాలా మంది వెక్కిరించారట. హీరోయిన్ కు ఉండాల్సిన గొంతు కాదు ఇది. మగాడి గొంతులా ఉంది అంటూ కామెంట్ చేశారట. అంతే కాదు చాలా హేళన చేసేవారని కొన్ని సినిమాలకు తనను డబ్బింగ్ కూడా చెప్పనివ్వలేదని అన్నారు వరలక్ష్మీ. కానీ నేను పట్టుబట్టి ఇప్పుడు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా.. దాంతో నా నటనతో పాటు నా గొంతును కూడా అభిమానించే వాళ్లు పెరిగారు అని తెలిపింది వరలక్ష్మీ.