Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది అందాల భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది కృతిశెట్టి. ఇక ఉప్పెన తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలను లైన్‌లో పెట్టింది ఈ క్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నది నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తుంది కృతి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలతోపాటు యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం అనే సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి.
ఇక రామ్ – లింగుసామి సినిమాలో కూడా ఎంపిక అయ్యింది కృతి. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే కింగ్ నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’లో చైతూ జోడీగాను చేయడానికి అంగీకరించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మరో సినిమాలో మెరవనుంది. ఈ సినిమా చిన్న సినిమా కాదు.. మీడియం రేంజ్ మూవీ కూడా కాదు… ఓ భారీ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కృతి శెట్టి. ఈ క్రమంలో త్వరలో అల్లు అర్జున్ సరసన ‘ఐకాన్’ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చినట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ… ఆ పాత్రలను పూజ హెగ్డే, కృతిశెట్టి పోషిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం ఈ అమ్మడిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :