Upendra: తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని సినిమా చేశాను: ఉపేంద్ర

|

Feb 05, 2023 | 9:52 PM

పాన్ ఇండియా  రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Upendra: తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని సినిమా చేశాను: ఉపేంద్ర
Upendra
Follow us on
ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా  రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.
క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత క‌రోనా కూడా వ‌చ్చింది. అయితే చంద్రు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి భ‌గీర‌థుడిలా క‌బ్జ సినిమాను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చాడు. ఓ టీమ్‌గా అంద‌రినీ క‌లుపుకుంటూ ఓ ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డి వ‌ర‌కు చంద్రు వ‌చ్చాడు అన్నారు.
శ్రియా శ‌ర‌న్  ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి స్టార్స్‌తో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జానీ మాస్ట‌ర్‌. నేను తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. మీ అంద‌రి స‌పోర్ట్‌కి థాంక్స్‌. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నాం అన్ని అన్నారు.