మెగా కోడలు ఉపాసన కొణిదెల పుట్టినిల్లైన కామినేని ఇంట్లో విషాదం నెలకొంది. ఉపాసన నాన్నమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన నాన్నమ్మ పుష్ చివరి వరకూ కృతజ్ఞత, సానుభూతి, గౌరవం , ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపింది. ఆమె జీవితాన్ని చూస్తూ నేను ఏంతో నేర్చుకున్నా.. ఎలా జీవించాలో తెలుసుకున్నానని పేర్కొంది. ఈరోజు నాన్నమ్మ తన జీవితాన్ని చలించి నిష్క్రమించింది. పుష్ప నాని నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నేను నా తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మల నుంచి ఎంతో ప్రేమని అందుకున్నాను.. రేపు ఇదే అనుభవాలను నా పిల్లలకు అందిస్తానని వాగ్దానం చేస్తున్నానని ఉపాసన తనకు తన గ్రాండ్ పేరెంట్స్ మీద ఉన్న ప్రేమను ప్రకటించింది.
తన నానమ్మ పుష్ప తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది ఉపాసన. నెటిజన్స్ , ,మెగా ఫ్యాన్స్ ఉపాసనకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
త్వరలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా వారసుడు కోసం ఫ్యామిలీ సభ్యులతో పాటు.. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా కోడలు ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్‌గానూ బాధ్యతలను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, ఆరోగ్య సలహాలు, తన భర్తకు సంబందించిన విషయాలను షేర్ చేస్తూ.. యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి