Actress: ప్రకృతిని కూడా ప్రేమలో పడేసే అందం ఈ అమ్మడి సొంతం.. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?
తాజాగా పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు లేటెస్ట్ సెన్సేషన్.. ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.?
సోషల్ మీడియాలో నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. చైల్డ్ హుడ్ ఫొటోస్ దగ్గరనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు అన్ని వైరల్ అవుతుంటాయి. తాజాగా పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు లేటెస్ట్ సెన్సేషన్.. ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? తెలుగులో సినిమాలు చేయలేదు కానీ డబ్బింగ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ అమ్మడి అందానికి పడిపోని కుర్రాడు ఉండడు.. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. అంతలా ఆకట్టుకుంది ఈ భామ.. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే..
ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ లవ్ టుడే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా..ఈ సినిమా యువతను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహించి హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా..
తాజాగా ఆ అమ్మడి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ పై మీరూ ఒక లుక్కేయండి.
View this post on Instagram