Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆ మధ్య బైక్ ఆక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు. కొద్ది నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే పూర్తగా కోలుకున్న తేజ్ ను పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. నూతన సంవత్సం సందర్భంగా ఆయన స్వయంగా తేజ్ ఇంటికి వెళ్లి కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్నీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ధన్యవాదాలు కిషన్ రెడ్డిగారు.. మీరు మీ బిజీ షెడ్యూల్ లోనూ నన్ను కలుసుకునేందుకు స్వయంగా మా ఇంటికి రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ కొత్త మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ తేజ్ ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో తేజ్ పూర్తిగా కోలుకొని కనిపిస్తున్నాడు. మరి కొద్దిరోజుల్లోనే తేజ్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Thank you @Kishanreddybjp Garu for making time to affectionately visit me at home despite your busy schedule and for your warm and kind words.
Wishing you a great year ahead. pic.twitter.com/Lne2XNv4uJ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 1, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :
Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..