Uma Maheswara Ugraroopasya : సత్యదేవ్..తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. అతడు ఎన్నుకునే కథలు చాలా భిన్నంగా ఉంటాయి. తాజాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చేశాడు సత్యదేవ్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. వీక్షకుల నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. చిత్రంలోని ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్ జీవించాడని అందరూ కొనియాడుతున్నారు. డిజిటల్‌లో భారీగా వ్యూస్‌ను రాబడుతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా శాటిలైట్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ కొనే విషయంలో సహజంగా మా టీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ వంటి ఛానల్స్ పోటి పడి కొంటాయి. కానీ ఈసారి భిన్నంగా ఈ సినిమాను కొనేందుకు ఈటీవీ ఇంట్రస్ట్ చూపించింది. ఈ టీవీ యాజమాన్యం ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు 2.5 కోట్లకు కొన్నట్లుగా సమాచారం. అంతేకాదు అతి త్వరలోనే ఈ మూవీ ఈటీవీలో ప్రసారం అవ్వనుందట. కాగా ఈ చిత్ర మొత్తం బడ్జెట్ కూడా రెండు కోట్లు కాకపోవడం గమనార్హం.
మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తెరకెక్కింది. అక్కడ లీడ్ రోల్‌లో ఫాహిద్ ఫాజిల్ నటించాడు. ఇక ఈ సినిమాను తెలుగులో ఆర్కా మీడియా వర్క్స్, మహాయణ మోషన్ పిక్చర్స్ సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేశాడు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో పోషించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నరేష్, సుహాస్, జబర్థస్త్ రామ్ ప్రసాద్ కనిపించారు.
Read More : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మనసు : గాయపడ్డ వ్యక్తికి రోడ్డుపైనే ప్రాథమిక వైద్యం