Nuvvu Nenu: ఏంటీ మేడమ్ మీరు.. అస్సలు మారలేదు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది..

తెలుగు చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమవుతుంటారు. ఇక మరికొందరు మాత్రం తమ క్రేజ్ కాపాడుకోవడంలో విఫలమవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే.

Nuvvu Nenu: ఏంటీ మేడమ్ మీరు.. అస్సలు మారలేదు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది..
Nuvvu Nenu

Updated on: May 22, 2025 | 6:24 PM

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని రూపం. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హ్యాట్రిక్ హిట్టు కొట్టిన హీరో. కెరీర్ తొలినాళ్లల్లోనే వరుసగా భారీ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథ చిత్రాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఉదయ్ కిరణ్ సినిమాలు, సాంగ్స్, డైలాగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ హీరో నటించిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన అందమైన లవ్ స్టోరీ. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. అయితే ఇందులో ఉదయ్ కిరణ్ సరసన నటించి అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారిన హీరోయిన్ అనిత.

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనితకు.. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ఆ తర్వాత కాపాడుకోలేకపోయింది. తెలుగులో శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. నెమ్మదిగా టాలీవుడ్ కు దూరమైన అనిత.. హిందీలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంది. అక్కడే సీరియల్, సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది.

ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంది అనిత. 2013లో గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది అనిత. ఆ తర్వాత సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం సుహాస్, మాళవిక మనోజ్ నటిస్తున్న ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం అనిత వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది అనిత. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..