- Telugu News Photo Gallery Cinema photos These films have a very low budget, but the audience talk is amazing
Lower Budget Movies: ఈ సినిమాలు బడ్జెట్ చాలా తక్కువ.. ఆడియన్స్ టాక్ మాత్రం అద్భుతం..
తెలుగులో బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి, పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్లు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే, కొన్ని సినిమాలపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరమైన విజయాలు సాధించాయి. మరి తెలుగులో వచ్చిన ఆరు స్లీపర్ హిట్స్ ఏంటి.? ఈరోజు ఈ స్టోరీలో చూద్దాం..
Updated on: May 22, 2025 | 5:50 PM

కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ తక్కువ బడ్జెట్ గ్రామీణ నాటకం బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది.

'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో పూర్తిగా కొత్త నటీనటులు నటించారు. నిహారిక కొణిదెల ఏదు వంశీ దర్శకత్వంలో నిర్మించారు. ₹10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ₹25 కోట్లు వసూలు చేసి, 2024లో అతిపెద్ద స్లీపర్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మీరు దీన్ని ETV Winలో చూడవచ్చు.

'ఆయ్' సినిమాలో స్టార్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంట తెరకెక్కిన రొమాంటిక్ కామెడి మూవీ. ₹5 కోట్ల కంటే ఖర్చుతో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిన '35 చిన్న కథ కాదు' సినిమా నివేదా థామస్ నటించిన కుటుంబ కథా చిత్రం. థియేటర్లలో మంచి విజయం సాధించినప్పటికీ, ఆహాతో ఓటీటీ ఒప్పందం కుదిరిన తర్వాత భారీ లాభాలు వచ్చాయి. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

విజయవంతమైన 'మత్తు వడలరా' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన 'మత్తు వడలరా 2' సినిమా నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, సత్య హాస్యభరితమైన నటనతో ఊపందుకుంది. ఈ సినిమా ₹30 కోట్లకు పైగా వసూలు చేసింది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని వీక్షించవచ్చు.

'గామి' గత ఏడాది వచ్చి ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ₹2 కోట్ల తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా ₹13 కోట్లకు పైగా వసూలు చేసింది. విశ్వక్ సేన్, చాందిని చౌదరి నటించిన ఈ చిత్రం ఇప్పుడు Zee5లో ప్రసారం అవుతోంది.




